అధ్యాత్మ సంకీర్తన
రేకు: 243-4
సంపుటము: 3-245
రేకు: 243-4
సంపుటము: 3-245
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| అచ్చుతు కృపాలబ్ధ మదియుఁగాక మచ్చిక నాతఁడు సేసే మతకముఁ గాక | ॥పల్లవి॥ |
| నానాపాట్లఁ బడె నాఁడు కరి మకరిచే హీనదెస ప్రహ్లాదుడు హిరణ్యుచేఁ బాటువడె పానిపట్టి హరి యది పరిహరించనివాఁడా ఆనుక హరిదాసుల కంతటనే భంగమా | ॥అచ్చు॥ |
| తగిలి భీష్ముడు శరతల్పమందు నుండఁడా అగడై విభీషణుఁడు అన్నచేఁ దన్నువడఁడా పగపాడే చూచుచుండ భాగవతులను హరి (?) తగినపుణ్యుల నిందు తప్పు లెంచవచ్చునా | ॥అచ్చు॥ |
| మంతనాన నారదుఁడు మాయలకుఁ లోనుగాఁడా చెంతల నర్జునునకు చేతులు దెగిపడవా ఇంతలో శ్రీవేంకటేశుఁడిట్టె వీని మన్నించఁడా ఇంతటి మహానుభావు లిందుకు జడుతురా | ॥అచ్చు॥ |


