అధ్యాత్మ సంకీర్తన
రేకు: 244-5
సంపుటము: 3-252
రేకు: 244-5
సంపుటము: 3-252
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| నిత్యానందులము నిర్మలులమిదే నేము సత్యముగ మమ్మాతఁడు సరిఁ బుట్టించఁగను | ॥పల్లవి॥ |
| యెక్కడవోయి వెదకే మిటమీఁద దైవమును వొక్కట నంతర్యామై వున్నాఁడదె ఇక్కడ నాతనిగుణా లెన్నేసి చదివే మిఁక పక్కన తన దాసుల భక్తికి సులభుఁడు | ॥నిత్యా॥ |
| యేమేమి వేఁడుకొనేము యిటమీఁద నాతని నామములు నాలికపై నటించీనదే నేమమున నింకా నెట్టు నిచ్చలు భుజించేమో కామించి సంసారపు కైంకర్య మాతనిదే | ॥నిత్యా॥ |
| ధ్యాన మేమని సేసేము తలఁచినందెల్లాను పూని శ్రీవేంకటేశుఁడే వుండఁగాను నానాఁట నిఁక నేమి నమ్మితి మనేదేమి పేని మమ్ముఁ దన కుక్షిఁబెట్టి పెంచఁగాను | ॥నిత్యా॥ |


