అధ్యాత్మ సంకీర్తన
రేకు: 245-1
సంపుటము: 3-254
రేకు: 245-1
సంపుటము: 3-254
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| వెనుబల మైననుఁ గావఁగ వేరీ విష్ణు డొఁకడేకాక అనుమానములన్నియు నుడిగితిని అలసితి నిఁక నేను | ॥పల్లవి॥ |
| పట్టిన చలము మానదు ప్రకృతి స్వతంత్రమున పెట్టేడి మాయలనే కమ్మర పెట్టదు వివేకము వుట్టితి నిన్నాళ్లాయను పొదలితి బుద్ధెరిఁగి దిట్టనై అదికాదని తోసేటి దీమనమూ లేదు | ॥వెను॥ |
| తగిలెడి అనుబంధము మానదు తలఁపను నొకవంక తెగనియ్యదు కర్మము లేమిటిని తెగించుఁ బుణ్యముల నగుచునే ముదిమికి లోనైతి నానాఁటికి నేను మగటిమి నే దాని నణఁచను మరిగెడిదేకాని | ॥వెను॥ |
| చేసిన అలవాటు మానఁడు జీవుఁడు తనగుణము వేసరదు అనుభవించుటకు వేసరు ముక్తికిని దాసునిఁగా శ్రీవేంకటేశుఁడు దయఁజూచెను నను నీవేళ మోసములన్నియును దేరెను మునుపు వెనక యేదో | ॥వెను॥ |


