అధ్యాత్మ సంకీర్తన
రేకు: 245-5
సంపుటము: 3-258
రేకు: 245-5
సంపుటము: 3-258
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును సృష్టించె నొక్కవేళనే శ్రీజయంతినాఁడు | ॥పల్లవి॥ |
| హరి కృష్ణావతారమందినయంతలోనే పరమ మునులకెల్ల భయముడిగెను తెరలి దైత్యులగుండె దిగులుచొచ్చె నత్తరి సిరుల మించినయట్టి శ్రీజయంతినాఁడు | ॥శిష్ట॥ |
| గోవిందుఁడు వసుదేవుకొడుకైన యప్పుడే గోవులు రంకెలువేసె గొల్లపల్లెను నోవితోడఁ గంసునికి నూరునిండెఁ జూడఁగానె చేవలు మీరినయట్టి శ్రీజయంతినాఁడు | ॥శిష్ట॥ |
| నారాయణుఁడు భువి నరుఁడు దాఁ గాఁగానే మేరఁ బాండవు లెచ్చిరి మేనవావిని కౌరవులపని దీరె కమ్మి శ్రీవేంకటేశుఁడు చేరువనే మెరయఁగ శ్రీజయంతినాఁడు | ॥శిష్ట॥ |


