అధ్యాత్మ సంకీర్తన
రేకు: 247-6
సంపుటము: 3-271
రేకు: 247-6
సంపుటము: 3-271
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| ఈతఁడు బలువుఁడౌట కివియే సాక్షి యీతఁడు బ్రహ్మమౌట కీతఁడే సాక్షి | ॥పల్లవి॥ |
| అమరుల మొరాలించి అసుర బాధలు మాన్పె అమరుల కెక్కుడౌట కదియే సాక్షి అమృతము పంచిపెట్టి యాదిలక్ష్మిఁ గైకొనె అమృతమథనమే అన్నిటికి సాక్షి | ॥ఈతఁ॥ |
| యిందరుండే బ్రహ్మాండాలు యిదె కుక్షి నించుకొనె యిందరి కెక్కుడగుట కిదియే సాక్షి కందువ వరములిచ్చు కడ నెన్నఁడు జెడవు కందువ పురాణాలలో కథలే సాక్షి | ॥ఈతఁ॥ |
| ఆది బ్రహ్మఁ బుట్టించె మఱ్ఱాకుమీఁదఁ దుదఁ దేలె ఆదినంత్య మీతఁడౌట కదివో సాక్షి పాదుగా శ్రీవేంకటాద్రిపై మహిమ వెదచల్లె పాదుకొన్నయీతని శ్రీపాదములే సాక్షి | ॥ఈతఁ॥ |


