అధ్యాత్మ సంకీర్తన
రేకు: 22-1
సంపుటము: 1-131
రేకు: 22-1
సంపుటము: 1-131
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నారణి
| పరగు బహుసజ్జన్మపరిపక్వహృదయుఁడై[1] మరి కదా వేదాంతమార్గంబు గనుట | ॥పరగు॥ |
| కలుషహరమగు వివేకమ్ము గలిగినయట్టి ఫలముగాదా కృపాపారీణుఁడౌట తలపోసి సకలభూతదయావిశేషంబు కలిగికాదా గుణవికారంబు గనుట | ॥పరగు॥ |
| యెదిరిఁ దనవలెనె తా నెఱఁగనేర్చిన ఫలము అదిగదా ద్రవ్యమోహంబు గడచనుట పదిలమగు నాశానుభవము పాపినయట్టి తుదగదా తాను సంతోషంబు గనుట | ॥పరగు॥ |
| రతి[2]పరాఙ్ముఖ మహారాజ్య మబ్బిన ఫలము మతి గదా తాను కర్మత్యాగియౌట తతితోడ ఫలపరిత్యాగి చిత్తవ్యాపి ధృతిగదా వేంకటాధిపు దాసుఁడౌట | ॥పరగు॥ |
[1] ‘యులై’ రేకు.
[2] ‘పరాన్ముఖ’ రేకు.


