అధ్యాత్మ సంకీర్తన
రేకు: 22-2
సంపుటము: 1-132
రేకు: 22-2
సంపుటము: 1-132
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| చలపాది రోగ మీసంసారము నేఁడు బలువైన మందు విష్ణుభక్తి జీవులకు | ॥చలపాది॥ |
| కీడౌట మది నెఱింగియు మోహ మెడల దిది పాడైన విధికృతము బలవంతము [1]యీడనే ఇది మాన్ప హితవైన వజ్రాంగి జోడువో హరిఁ దలంచుట జీవులకును | ॥చలపాది॥ |
| హేయమని తెలిసి తా నిచ్చగించీ యాత్మ పాయ దీరతిసుఖము బలవంతము మాయ నుగ్గులుసేయ మాధవుని దంచనపు రాయివో వైరాగ్యరచన జీవులకు | ॥చలపాది॥ |
| పొలయు దురితంపు రొంపులు దన్ను వడి ముంచ పలుమారు జన్మ మీబలవంతము నెలవుకొని సకలంబు నిర్మలముగాఁ గడుగు జలధివో వేంకటేశ్వరుఁడు జీవులకు | ॥చలపాది॥ |
[1] ‘ఈడనే యిది’ పూ.ము.పా.


