అధ్యాత్మ సంకీర్తన
రేకు: 259-4
సంపుటము: 3-340
రేకు: 259-4
సంపుటము: 3-340
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| అక్కడ నెక్కడి నరకము ఆ మాటే కల్లా దిక్కుల ని(నిం?)దె ఇన్నియుఁ దీరుచుకొంటిమయ్యా | ॥పల్లవి॥ |
| తనువిది మలమూత్రంబుల(లు?) దాకొనియుండిన పట్ణము దినదినమును వుచ్చిష్టపుదిడ్లఁ దూరెదము జననము నెత్తురు నెమ్ములు సారెకు నూరెడిగుంతలు మనిమని నరకము చొచ్చిన మనుజుల మిదె నేము | ॥అక్క॥ |
| మదనజలంబుల కాలువ మాపెద్దల పూర్వంబులు(?) పొదలిన పుత్రుల యిసిళ్లపుట్టలు వెట్టెదము యెదుటనె సంసారంబులు యెడయని కారాగృహములు మదిమది నరకము చవిగొను మనుజుల మిదె నేము | ॥అక్క॥ |
| వుట్టినదే నగ్నత్వము బూతో బండో యెరఁగము చిట్టంట్లవాచవులగు జీవుల మ్రింగెదము నెట్టన శ్రీవేంకటేశ్వర నీతోఁ గూడఁగ జగములు మట్టినచోటే మట్టే మనుజుల మిదె నేము | ॥అక్క॥ |


