అధ్యాత్మ సంకీర్తన
రేకు: 260-3
సంపుటము: 3-345
రేకు: 260-3
సంపుటము: 3-345
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| తల మొలా నొక్కసరా తను వొక్కటౌఁ గాక కొలఁది యెరిఁ గతనిఁ గొలువరో మీరు | ॥పల్లవి॥ |
| బొడ్డున బ్రహ్మఁ గనిన పురాణపురుషుఁడే దొడ్డుఁ గాక ఆతని తోడివాఁడ(డా?) వొడ్డిన కైలాసమే లేవు మాపతిఁ గడుపులో వెడ్డువెట్టి పెంచేవాఁడు వీరితోవాఁడా | ॥తల॥ |
| చక్కని కన్నుల సూర్యచంద్రులుగాఁ గలవాఁడు యెక్కుడుగా కిందరిలో నీడువెట్టేదా అక్కర యీ దేవతల కాపద మానిపేవాఁడు వెక్కసమే కాక యెంచ వీరిలోనే వొకఁడా | ॥తల॥ |
| అందరు నీతనియందే అయితే నౌదురుఁ గాక యెందును శ్రీపతి తోడియీడువారా కందువ శ్రీవేంకటాద్రి ఘనవరము లొసఁగె దిందుపడ్డ లోకులకు ద్రిష్టమిదే కాదా | ॥తల॥ |


