అధ్యాత్మ సంకీర్తన
రేకు: 261-3
సంపుటము: 3-351
రేకు: 261-3
సంపుటము: 3-351
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| చెప్పఁగా నెఱఁగరా చేరి వేదవ్యాసులు తప్పక చేతులెత్తి దైవ మితఁడన్నది | ॥పల్లవి॥ |
| యిరవుగా నెఱఁగరా యెల్ల దేవతలలో పొరిఁ గృష్ణుఁడు అగ్రపూజ గొన్నది తిరమై తెలియరా యీ దేవుని పాదపూజ హరుని శిరసుమీఁద నమరి వుండినది | ॥చెప్పఁ॥ |
| యింకా నెఱఁగరా యితని రామమంత్రము తెంకినుండి హరుఁ డుపదేశించేది పొంకమిదెరఁగరా భువిమీఁద శరభము- మంకుదన మెల్లఁ దీర మానిపివేసినది | ॥చెప్పఁ॥ |
| చూచియు నెఱఁగరా సొరిది శ్రీవేంకటాద్రి- నేచిన వరములెల్లా నియ్యఁగాను కాచే దెఱఁగరా ఘనుడితఁ డెవ్వరైనా చేచేత శరణంటేఁ జేకొనే బిరుదు | ॥చెప్పఁ॥ |


