అధ్యాత్మ సంకీర్తన
రేకు: 261-4
సంపుటము: 3-352
రేకు: 261-4
సంపుటము: 3-352
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంతవరాళి
| పెఱుగఁగఁ బెఱుగఁగఁ బెద్దలమైతిమి నేము కఱకఱలే కాని కడగంట లేదు | ॥పల్లవి॥ |
| హరి నిన్న భుజియించి చాలునన్న యన్నమే అరిది నేఁడప్పటిని నాస రేఁచీని ధరలో రాతిరి గూడి తనిసిన సతులే పరగ నప్పటిని విభ్రాంతి రేఁచీని | ॥పెఱు॥ |
| మాయఁ గట్టి విడిచిన మలినపుఁ గోకలు యీయెడ నుదికితేనే యిచ్చ రేఁచీని కాయముపై మోఁచి పెట్టెఁ గట్టివేసిన సొమ్ములు మాయలై దినదినము మమత రేఁచీని | ॥పెఱు॥ |
| నీవు వట్టిన చలమో నేము సేసినట్టి తప్పో శ్రీవేంకటేశ్వరుఁడ చిక్కితి మిందు మోవరాని మోపయి ములుగనియ్యదు మమ్ము చేవ సంసారముపైఁ జిమ్మి రేఁచీని | ॥పెఱు॥ |


