అధ్యాత్మ సంకీర్తన
రేకు: 261-5
సంపుటము: 3-353
రేకు: 261-5
సంపుటము: 3-353
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఇంకానేలా తర్కవాదములు యిన్నియు నిందునే ముగిసెను యింకానేలా కొందరు మోక్షం బెవ్వరికిని లేదనుమాటా | ॥పల్లవి॥ |
| సరయువు పొంతను సకల జీవులకు సిరుల మోక్షమిచ్చితివని విన్నపుడే మరలుచు నాయనుమానము వాసెను ధర నీవొకఁడవే దైవమవని కంటినయ్యా | ॥ఇంకా॥ |
| తగిన లంకవొద్దను రాక్షసులను తెగనడిచి ముక్తితెరువు చూపినపుడే వగలఁ బెక్కుదేవతల వరంబులు జగతి నీపగకు సరిగావయ్యా | ॥ఇంకా॥ |
| యేమని చెప్పుదునిట్టి నీ మహిమ వేమరుఁ బురాణవిధి విన్నపుడు శ్రీమంతుఁడవు శ్రీవేంకటేశ్వర కామింప నీకంటే ఘనము లేదుగదవోఅయ్యా | ॥ఇంకా॥ |


