అధ్యాత్మ సంకీర్తన
రేకు: 261-6
సంపుటము: 3-354
రేకు: 261-6
సంపుటము: 3-354
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను నున్ననిమాటల నోరు నుడిగెడిదేదో | ॥పల్లవి॥ |
| వొద్దనుండే నాజన్మమోహో మరచితిఁగా చద్దివంటి మాతల్లిచన్ను మఱచితిఁగా ముద్దుతోఁ బొరలే మలమూత్రము మఱచితిఁగా యెద్దువంటివాఁడ నేను యెఱిఁగేటిదేదో | ॥అన్ని॥ |
| యిప్పటిచవి రేపటికెంచి తనియలేఁగా తప్పక కాంతలఁ జూచి తలఁపు దనియలేఁగా ముప్పిరిఁ బెక్కుగాలము ముదిసీఁ దనియలేఁగా పిప్పివంటివాఁడ నేను పెనఁగేటిదేదో | ॥అన్ని॥ |
| యేడదో యీదేహమౌత యేనేమి నెఱఁగఁగా కూడిన మనువెక్కడొ గురుతూ నెఱఁగఁగా యీడనే శ్రీవేంకటేశుఁ డిట్టే నన్నుఁ గాచెఁగా నీడవంటివాఁడ నేను నేరుపింకనేదో | ॥అన్ని॥ |


