అధ్యాత్మ సంకీర్తన
రేకు: 23-3
సంపుటము: 1-139
రేకు: 23-3
సంపుటము: 1-139
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| భోగిశయనమును బుసకొట్టెడిని యోగనిద్ర పాయును మేల్కొనవే | ॥భోగిశయనము॥ |
| కన్నులు దెరవక కమలబాంధవుఁడు వెన్నెల రేణువు వెలయ దిదే అన్నున మలసీ నరుణోదయ మిదే మిన్నక నీవిటు మేలుకొనవే | ॥భోగిశయనము॥ |
| తెల్లని కన్నులు దెరవక విరియఁగ నొల్లక జలజము లున్నవివే కల్లనిదుర నినుఁ గవియఁగ నియ్యక మెల్లనాయ నిటు మేలుకొనవే | ॥భోగిశయనము॥ |
| [1]తెరవగు రెప్పలఁ దెల్లవారవలె తెరవక చీఁకటి దీరదిదే తెరఁగు వేంకటాధిప నీవెఱుఁగుదు మెఱుఁగులు చల్లుచు మేలుకొనవే | ॥భోగిశయనము॥ |
[1] ఈ చరణములో రేకులో, ఈ చరణము మొదటినుండి మూడుపాదములవరకు ప్రాసస్థానమున సాధురేఫమే. కడపటి పాదమున శకటరేఫ. యతిప్రాసస్థలములో ఈ వాఙ్మయమున సాధుశకటరేఫల సాంకర్య మరుదు. వ్రాయసకాని లోపము కావచ్చు. ‘మెరుఁగు’ను ‘మెఱుఁగు’గా చెక్కినాడేమో?


