అధ్యాత్మ సంకీర్తన
రేకు: 262-6
సంపుటము: 3-360
రేకు: 262-6
సంపుటము: 3-360
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| మానుప వశమా మాయ లివన్నియు శ్రీనాథుఁడు మును సేసినవే | ॥పల్లవి॥ |
| రాతిరి చీఁకటి రతిఁ బగలు వెలుఁగు ఘాతల నెప్పుడు గలదిదియే యీతల జ్ఞానుల కిల నజ్ఞానుల- జాతివైరములు సహజములే | ॥మాను॥ |
| అసురలకు సురల కనాది నుండియు అసమున వైరంబది గలదే యెసగి వైష్ణవుల కిలఁ బ్రాకృతులకు పొసఁగని వాదము భువిఁ గలదె | ॥మాను॥ |
| యిహమునుఁ బరమును యీలంకెలతో విహితము చెప్పెడి వేదములే అహిపతి శ్రీవేంకటాధిపు మతమిది నిహితం బెఱిఁగిన నిశ్చలమే | ॥మాను॥ |


