Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 263-3
సంపుటము: 3-363
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
మించిన తలపోఁతలే మీఁద మిక్కిలి
కొంచెము(మొ?) దొడ్డో సరికోరి ఇందుకందుకు
॥పల్లవి॥
చేసేటి పుణ్యములకు చెందేటి పాపములకు
యీసుల సరికి సరి ఇందుకిందుకు
వాసులఁ బుట్టుగులకు వడి మరణాలకును
ఆసల సరికి సరి అందుకందుకు
॥మించి॥
దినదిన సుఖాలకు తీదీపు దుఃఖములకు
యెనసి సరికి సరి ఇందుకిందుకు
అనుఁగుఁ బున్నమలకు అమాస చీఁకట్లకు
అనయము సరికి సరందుకందుకు
॥మించి॥
శ్రీవేంకటేశ యిట్టే జీవులకు నేది గతి
యేవి చూచిన సరికి సరిందుకిందుకు
వేవేగ నీ శరణని వెలసి బ్రతికితిమి
యే వల్లలేదు సరి యెందుకం (కెం?)దుకు
॥మించి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము