అధ్యాత్మ సంకీర్తన
రేకు: 263-4
సంపుటము: 3-364
రేకు: 263-4
సంపుటము: 3-364
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| హరి యిచ్చిన వరము లటువలెఁ గావుగా తిరమై వివేకులెల్లాఁ దెలిసేటి దిదియే | ॥పల్లవి॥ |
| శిరసులు తుంచితుంచి చిచ్చులోన వేలిచి వరములు వడసె రావణుఁ డెన్నైనా నిరతి రాముని చేత నిమిషములోననే వరములన్నియు నెందో వరతిపాలాయ | ॥హరి॥ |
| వీరఘోరతపముల వెలయ బాణాసురుఁడు కోరి చేకొన్నవరాలు కోటానఁగోటి వూరకే కృష్ణునిచేత నొక యిసుమంతలోనే తోరమైన వరములు తుత్తునియలాయ | ॥హరి॥ |
| వట్టిజాలిఁ బొరలక వరుస విభీషణుఁడు జట్టిగ రఘుపతికి శరణనెను నెట్టన నాతనిఁ గాచె నేఁడూ నున్నాఁడదె యిట్టే శ్రీవేంకటాద్రి నిచ్చీ వరములు | ॥హరి॥ |


