అధ్యాత్మ సంకీర్తన
రేకు: 263-6
సంపుటము: 3-366
రేకు: 263-6
సంపుటము: 3-366
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఎక్కడి విరతి మాకు నిహమెల్లాఁ దగులు మక్కళించి మక్కళించి మాయకింతాఁ దగులు | ॥పల్లవి॥ |
| పుట్టినప్పుడే పాపపుణ్యములు దగులు అట్టె దేహమున కన్నమూఁ దగులు గట్టిగా నీరెండూనై తే కర్మమూఁ దగులు యెట్టునుఁ బోరాదు మాయకింతాఁ దగులు | ॥ఎక్క॥ |
| మనికి సంసారియైతే మమతలుఁ దగులు పెనగఁగఁ బెనగఁగా బిడ్డలూఁ దగులు అనువై యీలంపటాన కాసలెల్లాఁ దగులు మన సొక్కటొక్కటై మాయకింతాఁ దగులు | ॥ఎక్క॥ |
| అరయ శ్రీవేంకటాశుఁ డాత్మలోనే తగులు శరణన్నవారికి విజ్ఞానము దగులు గరిమ నిందువల్లనే ఘన మోక్షమూఁ దగులు మరిగినప్పుడే సుమ్మీ మాయకింతాఁ దగులు | ॥ఎక్క॥ |


