అధ్యాత్మ సంకీర్తన
రేకు: 264-2
సంపుటము: 3-368
రేకు: 264-2
సంపుటము: 3-368
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| నరహరి నీ దయమీఁదట నా చేఁతలు గొన్నా శరణాగతియును జీవుని స్వతంత్రము రెండా | ॥పల్లవి॥ |
| మొఱయుచు నరకపు వాకిలి మూసిరి హరి నీదాసులు తెఱచిరి వైకుంఠపురము తెరువుల వాకిళ్ళు నుఱిపిరి పాపములన్నియు నుగ్గుగ నిటు తూర్పెత్తిరి వెఱవము వెఱవము కర్మపువిధులిఁక మాకేలా | ॥నర॥ |
| పాపిరి నా యజ్ఞానము పరమాత్ముఁడ నీదాసులు చూపిరి నిను నామతిలో సులభముగా నాకు రేఁపిరి నీపై భక్తిని రేయినిఁ బగలును నాలో వోపము వోపము తపములు వూరకె ఇఁక నేలా | ॥నర॥ |
| దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీవేంకటేశ్వర అద్దిరి నీదాసులు నీయానందములోన ఇద్దరి నీనా పొందులు యేర్పరచిటువలెఁ గూర్చిరి వొద్దిక నొద్దిక నాకిఁక నుద్యోగములేలా | ॥నర॥ |


