అధ్యాత్మ సంకీర్తన
రేకు: 264-5
సంపుటము: 3-371
రేకు: 264-5
సంపుటము: 3-371
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| చాలుఁజాలు నీ హరియే మాకును సకలక్రియలకు నాయకుఁడు నాలుక తుదనే యీతఁడుండఁగా నలుగడ నెవ్వరి వెదకేము | ॥పల్లవి॥ |
| యేలినవాఁడట లక్ష్మీవిభుఁడట యేమిటనుఁ గొరత మాకిఁకను నాలోనున్నాఁడు బ్రహ్మతండ్రియట నాకాయుష్యము బాఁతా పాలజలధిపై దేవుని వారము పాఁడి మాకు నిఁక నేమరుదు ఆలింపఁగ నేమింతటివారము అన్యులకిఁకఁ జేయి చాఁచేమా | ॥చాలుఁ॥ |
| భూకాంతాపతి కింకరులము యీ భూము లిన్నియును మాసొమ్మే పైకొని చక్రాయుధుఁడే మాదాపు భయము లిన్నిటాఁ బాసితిమి యీకడ నచ్యుతుమరఁగు చొచ్చితిమి యెన్నటికిని నాశములేదు యేకొఱఁతని ఇఁక నాసపడుచు నేమెవ్వరికి నోళ్లు దెరచెదము | ॥చాలుఁ॥ |
| శ్రీవైకుంఠుని దాసులమట యరచేతిది మోక్షము మా కిదివో పావనగంగాజనకుని బంట్లము పాపములన్నిటఁ బాసితిమి శ్రీవేంకటపతి వరములియ్యఁగా జిక్కిన వెలుతులు మాకేవి యీ వైభవములఁ దనిసిన మాకును ఇతరులఁ దగిలెడిదిఁక నేది | ॥చాలుఁ॥ |


