అధ్యాత్మ సంకీర్తన
రేకు: 265-4
సంపుటము: 3-375
రేకు: 265-4
సంపుటము: 3-375
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మంగళకౌశిక
| ఇది నమ్మలేఁడు పుణ్యాలేమేమో చేసీ దేహి పొదలి యిందువంకనే పొడవెక్కలేఁడా | ॥పల్లవి॥ |
| మంచి మందుగొన్నవాఁడు మహామహారోగముల అంచెలఁ బాసి సుఖియయ్యీనటా అంచితపు హరినామమనే మందుగొన్నవాఁడు పొంచి పాపరోగములఁ బోఁదోలలేఁడా | ॥ఇది॥ |
| జోడు దొడిగినవాఁడు చొక్కపు టలుగులకు వోడక రణజయము నొందీనటా వాడక హరిదాస్యపు వజ్రపంజరపువాఁడు వీడ జన్మపుటమ్ములు విదలించలేఁడా | ॥ఇది॥ |
| వైపగుఁ గాణాచిగలవాఁడు దరిద్రముఁ బాసి పైపై సంపదలతో బ్రదికీనటా దాపై శ్రీవేంకటేశు పాదములందుఁ గాణాచి యేపొద్దూఁ గలుగువాఁడు యెక్కువగా లేఁడా | ॥ఇది॥ |


