అధ్యాత్మ సంకీర్తన
రేకు: 267-2
సంపుటము: 3-384
రేకు: 267-2
సంపుటము: 3-384
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నాకేల విచారము నాకేల యాచారము సాకిరైనవాఁడ నింతే సర్వేశుఁడే దిక్కు | ॥పల్లవి॥ |
| ప్రపంచ మధీనము పాలుపడ్డ దేహమిది ప్రపంచముతోడి పాటు పరగీని యెపుడూ నీయాతుమ యీశ్వరాధీనము అపు డాతఁ డెట్టునిచె నట్టె అయ్యీని | ॥నాకే॥ |
| కర్మాన కధీనము కలిములు లేములు కర్మమెట్టు గల్పించెఁ గలిగీని అర్మిలి నాయాచార్యు నధీనము మోక్షము ధర్మ మతని కృపను తానే వచ్చీని | ॥నాకే॥ |
| చిత్తమున కధీనము చిల్లరయింద్రియములు చిత్తము చిక్కినప్పుడు చిక్కీనవి హత్తి శ్రీవేంకటేశుదాస్య మధీనము జన్మము పొత్తుల నందుకు నది పూఁచినట్టయ్యీని | ॥నాకే॥ |


