అధ్యాత్మ సంకీర్తన
రేకు: 268-3
సంపుటము: 3-391
రేకు: 268-3
సంపుటము: 3-391
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| బాపురే వో ప్రాణి బాపురే వో మనసా వో పనస వెందుకైనా నొడఁబడేవు | ॥పల్లవి॥ |
| మురికి దేహమొకటి మోచుక నీ వప్పటిని మురికి దేహసతుల మోవఁగోరే వప్పటిని కరకు హేయము గొంత కడుపున నించుకొని తిరిగి హేయమేకాను(?) తినఁబోయే వప్పటి | ॥బాపు॥ |
| పసిఁడి కమ్ముడువోయి పరులఁగొలిచి మరిఁ బసిఁడి సొమ్మంటాఁ బైఁ బెట్టఁ గోరేవు పిసరుఁ బాపపుణ్యాలఁ బెడఁగేలు గట్టించుక విసువక అవియే కావించఁబోయే వప్పటి | ॥బాపు॥ |
| పంచభూతములచేతఁ బట్టువడి కమ్మరాను పంచభూతాల దేహుల బంధులంటాఁ దగిలేవు అంచెల శ్రీవేంకటేశుఁ డాతుమలో నున్నవాఁడు యెంచుక తెలిసియును ఇట్టె మరచే వప్పటి | ॥బాపు॥ |


