అధ్యాత్మ సంకీర్తన
రేకు: 269-5
సంపుటము: 3-399
రేకు: 269-5
సంపుటము: 3-399
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| అల్లనాఁడే యిదెరఁగ మైతిమి గాని యిల్లిదె దేవుని కృప యీడ నున్నది సుండీ | ॥పల్లవి॥ |
| చేరువవో మోక్షము శ్రీహరిభక్తికిని ధారుణిఁ గర్మమునకే దవ్వుగాని యీరీతి నింద్రియముల నించుకంతే దాఁటిన దూరముగాదు జ్ఞానపుతోవ వున్నది సుండి | ॥అల్ల॥ |
| ధరఁ జేతిది వైకుంఠ మతని దాస్యమునకు పరధర్మముల కగపడదు గాని అరుదైన యాసల ఆయము వొడిచితేనే అరసి యాకంతగుండా నందవచ్చుఁ జుండి | ॥అల్ల॥ |
| తలఁపులో దక్కె ముక్తి తగు శరణాగతికి శిలుగుఁ బుణ్యములకుఁ జిక్కదుగాని తెలిసి శ్రీవేంకటేశు తిరుమంత్రము నాలికెఁ బలికినాడనే దివ్యపద మబ్బుఁ జుండి | ॥అల్ల॥ |


