అధ్యాత్మ సంకీర్తన
రేకు: 272-3
సంపుటము: 3-414
రేకు: 272-3
సంపుటము: 3-414
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| చంచలము మానితేను సంసారమే సుఖము పొంచి హరిదాసుఁడైతే భూమెల్లా సుఖము | ॥పల్లవి॥ |
| వొరుల వేఁడకవుంటే వున్నచోనే సుఖము పరనింద విడిచితే భావమెల్లా సుఖము సరవిఁ గోపిఁచకుంటే జన్మ మెల్లా సుఖమే హరిఁ గొలిచినవారి కన్నిటాను సుఖమే | ॥చంచ॥ |
| కాని పని సేయకుంటే కాయమే సుఖము మౌనమున నుండితేను మరులైనా సుఖము దీనత విడిచితేను దినములెల్లా సుఖము ఆని హరిఁ దలఁచితే నంతటా సుఖమే | ॥చంచ॥ |
| చలము విడిచితేను సంతతము సుఖము యిల నాసలుడిగితే నిహమెల్లా సుఖమే తలఁగి శ్రీవేంకటేశు దాసులైనవారు వీని గెలిచి నటించఁగాను కిందా మీఁదా సుఖమే | ॥చంచ॥ |


