అధ్యాత్మ సంకీర్తన
రేకు: 272-6
సంపుటము: 3-417
రేకు: 272-6
సంపుటము: 3-417
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నిలిచినచోటనెల్లా నిధాన మీతఁడు యిల వెఱవ వెఱవ నేమిటికి నిఁకను | ॥పల్లవి॥ |
| హరి నాకుఁ గలఁడుగా అన్నిటిఁ బరిహరించ నిరతి గర్మములెంత నిండుకుండినా దరిదాపు ఇతఁడేకా తగ వెనుక వేసుకో విరవిరఁ బాపాలు నా వెంటఁ బడినాను | ॥నిలి॥ |
| గోవిందుఁడు గలఁడుగా కొంకు దీర్చి ననుఁ గావ కావరపు భవములు గదిమినాను దేవుఁడితఁ డున్నాఁడుగా దిక్కుదెసై నిలుపఁగా భావపు సంసారవార్ధి పైకొని ముంచినను | ॥నిలి॥ |
| శ్రీవేంకటేశుఁడే చిత్తగించి నన్నేలెఁగా వావాత నింద్రియాలు వళకాడినా యీవల నావల నితఁ డిహపరా లిచ్చెఁగా వావిరి నే దాస్యగర్వముతో నుండినను | ॥నిలి॥ |


