అధ్యాత్మ సంకీర్తన
రేకు: 273-1
సంపుటము: 3-418
రేకు: 273-1
సంపుటము: 3-418
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు యీవల నీ బంట నాకు నెదురింక నేది | ॥పల్లవి॥ |
| కామధేనువుఁ బిదుకఁగల కోరికెలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుఁడవట కామించి నీ బంటనట కమ్మి నిన్నుఁ దలఁచితి- నేమి మాకుఁ గడమయ్య యిందిరారమణా | ॥దేవ॥ |
| యెంచఁ గల్పవృక్షమును యిచ్చు సిరులెల్లాను నించి కల్పవృక్షముల నీడల కృష్ణుఁడవట అంచెల నీ బంటనట ఆత్మలో నిన్ను నమ్మితి వంచించఁ గడమ యేది వసుధాధీశ | ॥దేవ॥ |
| తగ నొక్క చింతామణి తలఁచినట్లఁ జేసు మిగులఁ గౌస్తుభమణి మించిన కృష్ణుఁడవట పగటు శ్రీవేంకటేశ భక్తుఁడ నీకట నేను జగములో గొఱతేది జగదేకవిభుఁడా | ॥దేవ॥ |


