Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 24-3
సంపుటము: 1-145
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఏల సమకొను సుకృత మెల్లవారికి మహా-
మాలిన్యమున నాత్మ మాసినది గాన
॥ఏల॥
కలికాలదోషంబు కడవరానిది గాన
తలఁపు దురితముల కాధారంబు గాన
బలుపూర్వకర్మములు పట్టరానివి గాన
మలమూత్రజన్మంబు మదకరము గాన
॥ఏల॥
రాఁపైన గుణవికారములు బహుళము గాన
ఆఁపరానివి యింద్రియంబు లటుగాన
దాఁపరంబగు మమత దయదలంపదు గాన
కాఁపురముచే నాస కప్పుకొనుఁ గాన
॥ఏల॥
హృదయంబు చంచలం బిరవుగానదు గాన
చదువు బహుమార్గములఁ జాటు నటుగాన
యెదురనుండెడు వేంకట్వేరుని నిజమైన
పదముపై కోరికలు పైకొనవు గాన
॥ఏల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము