అధ్యాత్మ సంకీర్తన
రేకు: 274-6
సంపుటము: 3-429
రేకు: 274-6
సంపుటము: 3-429
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| నడపే వేఁటికి నాటకము అడరి నిజముగా నానతి యీవే | ॥పల్లవి॥ |
| విశ్వమూర్తి కొక విన్నపము శాశ్వతములాయ జగములివి యీశ్వరేశ్వరున కింకొక విన్నపము ఐశ్వర్యమోక్షం బాత్మలకేది | ॥నడ॥ |
| రమాధిపతి కొక రహస్యము సమానుఁడవు నీవు సర్వమున క్రమాన నిఁక నొక రహస్యము సమోహి (?) నరకము స్వర్గము నేలా | ॥నడ॥ |
| హరి నే నొకమాఁ టడిగెదను నిరంతరాత్మవు నీవుగదే యిరవుగ శ్రీవేంకటేశ నే నడిగెద విరసము లేదిఁక విచార మేలా | ॥నడ॥ |


