అధ్యాత్మ సంకీర్తన
రేకు: 275-4
సంపుటము: 3-433
రేకు: 275-4
సంపుటము: 3-433
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| విచ్చేయవయ్యా వేంకటాచలముపొంత- కచ్చుగా నేమున్నచోటి కచ్యుతనారాయణా | ॥పల్లవి॥ |
| అల్లనాఁడు లంక సాధించందరును బొగడఁగ మల్లడి నయోధ్యకు మరలినట్లు యెల్లగాఁ గైలాసయాత్ర కేఁగి కమ్మర మరలి వెల్లవిరి ద్వారకకు విచ్చేసినట్లు | ॥విచ్చే॥ |
| యెన్నికతో గోమంతమెక్కి జయము చేకొని మన్ననతో మధురకు మరలినట్లు అన్నిచోట్లా నుండి అల్లిరము లారగించ వెన్నుఁడవై వేడుకతో విచ్చేసినట్లు | ॥విచ్చే॥ |
| వహికెక్కఁ ద్రిపురాల వనితల బోధించి మహి నిందిర వొద్దికి మరలినట్లు విహగగమన శ్రీవేంకటేశ మముఁ గావ విహితమై నామతిలో విచ్చేసినట్లు | ॥విచ్చే॥ |


