అధ్యాత్మ సంకీర్తన
రేకు: 275-5
సంపుటము: 3-434
రేకు: 275-5
సంపుటము: 3-434
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| మా దురితములు వాపి మమ్ముఁ గాచుటరుదా శ్రీదేవీరమణుఁడ శ్రీవేంకటేశ | ॥పల్లవి॥ |
| అంబరీషుఁ బైకొన్న ఆపదలన్నియుఁ బాపి బెంబడిఁ గాచె నీచే పెనుచక్రము అంబరాననున్న ధ్రువు నజ్ఞానమెల్లఁ బాపె పంబి నీ చేతనుండిన పాంచజన్యము | ॥మాదు॥ |
| పక్కన జరాసంధు బలమెల్ల నుగ్గాడి నిక్కము మధురనిల్పె నీచే గద తొక్కి హిరణ్యకశిపుఁ దునిమి ప్రహ్లాదుఁ గాచె నిక్కి నిక్కి మెరిచేటి నీఖడ్గము | ॥మాదు॥ |
| వెడ రావణునిఁ జంపి విభీషణునిఁ గాచె చిడుముడి పడక నీచే శార్ఙ్గము యెడమీక శ్రీవేంకటేశ నేఁడు నన్నుఁ గాచె బడిబడి నీనామపఠన నేఁడిదిగో | ॥మాదు॥ |


