అధ్యాత్మ సంకీర్తన
రేకు: 276-1
సంపుటము: 3-436
రేకు: 276-1
సంపుటము: 3-436
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఎంత గాలమైనాను హెచ్చీ నాసలు శ్రీ- కాంతుఁడ వింతటనై నాఁ గరుణించరాదా | ॥పల్లవి॥ |
| పచ్చితనానఁ దిరిగి పండవద్దా చిత్తము గచ్చులఁ దాఁ గసుఁగాయే కలకాలము చచ్చి చచ్చి పుట్టి పుట్టి జారవద్దా కర్మము కొచ్చి కొచ్చి సేసి సేసి గోరపడీఁ గాక | ॥ఎంత॥ |
| రోఁత గడుపున నించి రోయవద్దా దేహము కూఁతలతో రుచులెల్లాఁ గోరీఁగాక చేఁతలు యీగుణమైన సిగ్గుపడవలదా బాఁతిపడి విషయాలఁ బరచయ్యీఁ గాక | ॥ఎంత॥ |
| నానాఁడే విరతిఁబొంది నవ్వు నవ్వవలదా మానక యీ జీవుఁ డనుమానించీఁ గాక మోనాన శ్రీవేంకటేశ మొక్కి నీదాసుడఁ గాఁగా అనిన విన్నియుఁ బరిహరమయ్యీఁ గాక | ॥ఎంత॥ |


