అధ్యాత్మ సంకీర్తన
రేకు: 276-2
సంపుటము: 3-437
రేకు: 276-2
సంపుటము: 3-437
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| సొమ్ము గలవాఁడు తన సొమ్ము చెడనిచ్చునా కమ్మి నీ సొమ్మను నేను కాపాడవే హరి | ॥పల్లవి॥ |
| పసుర మడవిఁ బడ్డ పసురము గలవాఁడు దెసలు వెద కింటికిఁ దెచ్చు కొన్నట్టు వసగా నాసల లోన వడిఁబడ్డ నా మనసు యెసగ మళ్లించవే నన్నేలిన గోవిందుఁడా | ॥సొమ్ము॥ |
| గొందిఁ బంట సేయువాఁడు కొలుచులు పరకళ్లఁ జిందకుండా గాదెఁ బోసి చేరి కాచీని కందువ మమ్ముఁ బుట్టించి కన్నవారి వాకిళ్లఁ జెంది కావనియ్యకువే జీవునిలో దేవుఁడా | ॥సొమ్ము॥ |
| కడుపులోని శిశువు కన్నతల్లి(ఁ?) దన్నితేను బెడగు లెంచక కని పెంచీనటా యెడమీక శ్రీవేంకటేశ నీకుక్షిలో నేను తడవి తప్పుసేసినా దయఁ గావవే | ॥సొమ్ము॥ |


