అధ్యాత్మ సంకీర్తన
రేకు: 276-4
సంపుటము: 3-439
రేకు: 276-4
సంపుటము: 3-439
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| దైవంబవు కర్తవు నీవే హరి యీవల నావల నెవ్వఁడనయ్యా | ॥పల్లవి॥ |
| తలఁచిన తలఁపులు దైవయోగములు కలిగిన చేఁతలు కర్మములు వెలసిన దేహము విషయాధీనము యిలనౌఁ గాదన నెవ్వఁడనయ్యా | ॥దైవం॥ |
| జిగి నింద్రియములు చిత్తపు మూలము తగులమి (ము?) మాయకుఁ దనుగుణము జగతిఁ బ్రాణములు సంసారబంధము యెగదిగ నాడఁగ నెవ్వఁడనయ్యా | ॥దైవం॥ |
| శ్రీతరుణీశ్వర శ్రీవేంకటపతి ఆతుమ యిది నీయధీనము యీతల నీవిఁక నెట్టైనఁ జేయుము యే తలపోఁతకు నెవ్వఁడనయ్యా | ॥దైవం॥ |


