అధ్యాత్మ సంకీర్తన
రేకు: 276-5
సంపుటము: 3-440
రేకు: 276-5
సంపుటము: 3-440
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| ఎన్నఁ డిఁక యేది గొలఁదిపాటు వున్నతపు మాయలకే వొడిగట్టవలసె | ॥పల్లవి॥ |
| చీ చీ మనసా చీ మనసా కాచేటి పూచేటి వో ఘనజన్మమా నీచు యెండమావులెల్లా నీళ్లంటా నమ్మినట్టు చూచి చూచి యింద్రియాలే సుఖమనవలసె | ॥ఎన్నఁ॥ |
| కట్టా జీవుఁడా కటకటా జీవుఁడా తొట్టిన పంచభూతాలతోడి దేహమా వెట్టిఁ జెఱకుపోలికి వెదురు నమలినట్టు కట్టిన యీ కనకమే బ్రహ్మమనవలెసె | ॥ఎన్నఁ॥ |
| బాపు బాపు దైవమా భావపు శ్రీవేంకటేశ చూపుల నాయాతుమలో సుజ్ఞానమా దోపుచుఁ బూవులవల్ల తుంగ దల కెక్కినట్టు దాపగు నాలికె నిన్నుఁ దలఁచఁగవలసె | ॥ఎన్నఁ॥ |


