అధ్యాత్మ సంకీర్తన
రేకు: 276-6
సంపుటము: 3-441
రేకు: 276-6
సంపుటము: 3-441
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| పొందినవెల్లా భోగ్యములే అందరిలో నిఁక ననుమానమేలా | ॥పల్లవి॥ |
| హరి నీ సంకల్ప మన్నిట నుండఁగ గరిమల మా సంకల్పము లేఁటికి దురితము లణఁచీ దొర నీ నామము సొరిది విధికిఁగా సుడివడనేలా | ॥పొంది॥ |
| జిగి నీ ధ్యానము చింతలు మాన్పఁగ వెగటున మా కిఁక వెడ చింతేఁటికి తగు నీ తత్త్వము తపఃఫల మొసఁగ అగడుఁ గోరికల ఆసలిఁ కేలా | ॥పొంది॥ |
| కమ్మి నీ శరణుగతి యిటు చూపఁగ కమ్మర నుద్యోగము మాకేఁటికి యిమ్ముల శ్రీవేంకటేశ్వర మా పాల నెమ్మదిగలవిఁక నే నాడనేలా | ॥పొంది॥ |


