అధ్యాత్మ సంకీర్తన
రేకు: 277-1
సంపుటము: 3-442
రేకు: 277-1
సంపుటము: 3-442
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| రాతిరిఁ బగలనేటి రెంటి నడుమనుఁ జిక్కి వూఁత గాన వెళ్లనీరో వో యాసలాల | ॥పల్లవి॥ |
| దైవ మెప్పుడు గలఁడు తలఁచఁగలేము గాని కైవసమై జీవుఁడుండు కానరాదు గాని పూవు పిందెవంటి పాపపుణ్యములఁ జిక్కినాఁడ తోవచూపరో మాకు తొలుజన్మములాల | ॥రాతి॥ |
| లోకము మాయామయమై లోనుఁ గాకుండుఁ గాని జోక పరమాత్మలోనే సోదించము గాని కైకొని మూసితెరచే కనురెప్పలనుఁ జిక్కి వాకిలిఁ గనేఁ జూపరో వద్దనున్న కాలమా (?) | ॥రాతి॥ |
| రూపము విజ్ఞానమే రూఢి కెక్కనైతిఁ గాని కాపు శ్రీవేంకటేశుఁడే గతి గంటిఁ గాని యీవారి నేనై తే నిహపరాలకుఁ జిక్కి పైపూఁత లేమి గానఁ బాలించవో గురుఁడా | ॥రాతి॥ |


