అధ్యాత్మ సంకీర్తన
రేకు: 278-2
సంపుటము: 3-448
రేకు: 278-2
సంపుటము: 3-448
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| భగవద్విభవపు ప్రత్యక్షం బిది జిగి నిందొకటియుఁ జేయఁగఁ గలమా | ॥పల్లవి॥ |
| దైవికమెపో తతియగు వానలు తావగు మొలకలు దైవికమే కావిరినివెల్లాఁ గంటా వింటా దైవమునేలో తలఁచము మనము | ॥భగ॥ |
| జననమరణములు హరి దైవికమే తనుపోషణములు దైవికమే యెనసి యివెల్లా నెఱిఁగియు మరిగియు కొన దైవమునేలో కొలువము మనము | ॥భగ॥ |
| యిహపరంబులును యివి దైవికమే తహతహ లుడుపఁగ దైవికమే అహిపతి శ్రీవేంకటాధిపు కృపచే మహిమ గంటిమిఁక మఱవము మనము | ॥భగ॥ |


