అధ్యాత్మ సంకీర్తన
రేకు: 278-3
సంపుటము: 3-449
రేకు: 278-3
సంపుటము: 3-449
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| నన్నెంచఁ బనిలేదు నిన్నెంచుటే కాని మన్నించు హరి నీ మఱఁగు చొచ్చితిని | ॥పల్లవి॥ |
| రాజుఁ బెండ్లాడిన యట్టి రమణి యేజాతైనా పూజితమై యిన్నిటాను భోగించినట్టు సాజాన నే నెంత సకలహీనుఁడనైనా వోజతో నిన్నుఁ గొలిచి వున్నతుఁడనైతిని | ॥నన్నెం॥ |
| వేల ముద్దుటంగరము వేడుకనిడి ప్రధాని కేలెత్తి యిందరిచే మొక్కించుకొన్నట్టు నేలనే నీ ముద్ర మోచి నే నేఁటివాఁడనైనా పేలరి జగములోనఁ బెద్దనైతి నిదివో | ॥నన్నెం॥ |
| తల్లిదండ్రి గలవాఁడు తప్పులేమైనాఁ జేసి తల్లితో ముద్దుగునిసి తప్పించినట్టు చల్లని శ్రీవేంకటేశ సరవి నీ కృపవల్ల కెల్లున నిన్ను నుతించి గెలిచితి నిదివో | ॥నన్నెం॥ |


