శృంగార సంకీర్తన
రేకు: 1986-3
సంపుటము: 29-453
రేకు: 1986-3
సంపుటము: 29-453
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| అటు గనక నేస్తము లమరు మీ కిద్దరికి కుటిలాలు లేవు మంచి గుణములే కాని | ॥పల్లవి॥ |
| మరిగినవారికి మచ్చికగలవారికి యరపరికములేదు యేమి సేసినా సరసమాడేవారికి చనవుగలవారికి విరసములేదు మరి వేడుకే కాని | ॥అటు॥ |
| ఆసగలవారికి ఆతుమైనవారికి యీసు లేదు మదిలోన యెట్టుండినా వాసిగలవారికి వలపుగలవారికి వేసట లేదు మరి వినోదమే కాని | ॥అటు॥ |
| యిచ్చకపువారికి మెనసినవారికి మచ్చరము లేదు యెన్నిమాఁట లాడినా యిచ్చట శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి హెచ్చుకుందు లేదు మీకు నింపులేకాని | ॥అటు॥ |


