శృంగార సంకీర్తన
రేకు: 1987-6
సంపుటము: 29-462
రేకు: 1987-6
సంపుటము: 29-462
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరినాట
| నా మేలువాఁడై యాతఁడు నావద్దనే వున్నవాడు యీ మతకములు మరి యిఁక నీకుఁ దగునే | ॥పల్లవి॥ |
| ఆసలు రేఁచుకొంటా నాకెకు నీతనికిని రాసికెక్క నే మాడేవే రాయబారాలు సేసవెట్టిననాపతిఁ జేరి నే నెఱఁగకుండా మూసి దాఁచి పొందుసేయ మన్నేడ నేర్చితివే | ॥నా మేలు॥ |
| సన్నలు సేసుకొంటా నారె సారె నిద్దరికి యెన్నిమారు లందించేవే యెడమాఁటలు పన్నుక నా కాఁగిటిలో పాయకుండిన యీతని వన్నెల నెలయించ నే వంకఁ గలిగితివే | ॥నా మేలు॥ |
| కడనుండి నవ్వుకొంటా గలపే వొకరొకరిఁ దడవక మానవే నీ తాపితనాలు యెడయక శ్రీవేంకటేశుఁడు నన్నేలినాఁడు అడరి నా కితవరివ య్యెట్టు వచ్చితివే | ॥నా మేలు॥ |


