అధ్యాత్మ సంకీర్తన
రేకు: 279-1
సంపుటము: 3-453
రేకు: 279-1
సంపుటము: 3-453
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| బలువుఁడు నాతఁడే బంధువుఁడు నాతఁడే తలఁ చాతనికి మొక్కఁ దగులింతే నేము | ॥పల్లవి॥ |
| దైవమే భారకుఁడు ధరణి రక్షించుటకు భావింప నరులచేఁత పనిలేదు శ్రీవల్లభుఁ డతఁడు నేసినట్టల్లా నవును వావాత ననుభవించేవారమింతే నేము | ॥బలు॥ |
| హరియే స్వతంత్రుఁడు అన్నిపనులుగాఁ జేయ పరుల వుద్యోగాలు పనిలేవు సురనాథుఁ డాతఁడు చూచినట్టల్లా నవును వరుసతోఁ దిరిగాడేవారమింతే నేము | ॥బలు॥ |
| సకలేశుఁడే కర్త జగములు గాచుటకు ప్రకటించ నేర్పులు పనిలేవు వొకట శ్రీవేంకటేశుఁ డొనరించినట్లవును సుకియించి పొగడేటి సుద్దులింతే నేము | ॥బలు॥ |


