Display:
శృంగార సంకీర్తన
రేకు: 1994-5
సంపుటము: 29-503
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
నగి నగి మిక్కుటమై నా గుణాలె ఇంతసేసె
తెగరాని నా వలపు తిద్ద నెట్టు వచ్చునే
॥పల్లవి॥
వొత్తిన మరుబాణాలు వొడ్డుకొనవచ్చుఁగాక
చిత్తమే చీఁదరగొంటే సేసేదేమే
మత్తిలి వెన్నెలకాఁక మాఁటుకొనవచ్చుఁగాక
హత్తి చన్నులే వేఁగైతే ననేదేమే
॥నగి॥
తగ్గక తుమ్మిద దాడి దప్పించుకొనవచ్చుఁగాక
సిగ్గులే చిమ్మిరేఁగితే సేసేదేమే
వొగ్గక కోవిలకూఁత లోరసించవచ్చుఁగాక
కగ్గి కోరికె కోఁడైతే గరిసించేదేమే
॥నగి॥
సోయగపు వసంతుని జునుగఁగవచ్చుఁగాక
పాయమే చలపట్టితే పదరేదేమే
యీయెడ శ్రీవేంకటేశు నిట్టె కూడవచ్చుఁగాక
ఆయములే కరఁగితే నట్టె సాదించేదేమే
॥నగి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము