శృంగార సంకీర్తన
రేకు: 1995-6
సంపుటము: 29-510
రేకు: 1995-6
సంపుటము: 29-510
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
| సరికి బేసికి మీరె జాణలైతిరి తిరమాయ వలపులు దిష్టముగా నిపుడు | ॥పల్లవి॥ |
| కలువల నాకె వేసె కాలు దొక్కితివి నీవు యెలమి సాకిరులు నేమేము చెప్పేము కలికి గుట్టు తోడిది గద్దరికాఁడవు నీవు వలసినట్టు సేసితే వద్దనేవా రెవ్వరు | ॥సరి॥ |
| కొద్ది మీరి నవ్వె నాపె కొంగువట్టితివి నీవు యిద్దరికి దగవు నే మెట్టు చెప్పేము పెద్దరికపు సకియ ప్రియమువాఁడవు నీవు తిద్దుకొని మీకు మీకే తేరుదురుగాక | ॥సరి॥ |
| గక్కనఁ గొసరె నాపె కాఁగిలించితివి నీవు యెక్కువ తక్కువలు నే మేమి చెప్పేము యిక్కడ నీ దేవులని యేలితివి శ్రీవేంకటేశ చక్కనాయఁ బనులెల్లా సాదించ నేమిటికి | ॥సరి॥ |


