అధ్యాత్మ సంకీర్తన
రేకు: 279-6
సంపుటము: 3-458
రేకు: 279-6
సంపుటము: 3-458
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| అంతర్యామీ వో అంతర్యామీ బంతి నాకేమి గల్లా నా పాలివాఁడవు గావా | ॥పల్లవి॥ |
| దొంతులై అన్ని యోనులాఁ దొల్లి నేఁ బుట్టేటినాఁడే అంతరాత్మవైనవాఁడ వటు నీవేకా ఇంతట విడిచేవా నన్నింద్రియాలఁ గట్టివేసి పొంతఁ జూచేవిటు నాకుఁ బొత్తులకాఁపవుగా | ॥అంత॥ |
| తొడరి స్వర్గనరక దుఃఖసుఖములనాఁడు అడరి కర్మసాక్షివటు నీవేకా విడువ వెప్పుడు నన్ను విషయాలఁ జిక్కినాఁడ కడ నూరకుండనేల కన్నవాఁడవు గావా | ॥అంత॥ |
| నీ చేతఁగానిది లేదు నీవు నాకుఁ బ్రాణమవు కాచుటకు నీకంటే నొక్కరు వచ్చేరా చేచేత శ్రీవేంకటేశ చేరి నీకు శరణంటి యేచి నన్ను మన్నించితివిది నీ తేజముగాదా | ॥అంత॥ |


