అధ్యాత్మ సంకీర్తన
రేకు: 25-1
సంపుటము: 1-149
రేకు: 25-1
సంపుటము: 1-149
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
| ఒప్పులై నొప్పులై వుండుఁ గాన అప్పటప్పటికిఁ జూడ నదియేకా నిజము | ॥ఒప్పులై॥ |
| కన్నుల కిన్నియుఁ జూడ కలలై వలలై వున్నతాలు నడ్డాలై వుండుఁ గాన చిన్న[1]చిన్న చిటి[2]పొటి చిమ్ముదొమ్ము దిమ్ములవి వున్నవన్నియుఁ జూడ నొకటేకా నిజము | ॥ఒప్పులై॥ |
| సారెకు నోరికిఁ జూడ చవులై నవ్వులై వూరటమాటలై వుండుఁ గాన తారుమారు తాఁకు సోఁకు తప్పుదోఁపు లిన్నియు వోరపారులేనివెల్ల వొక్కటేకా నిజము | ॥ఒప్పులై॥ |
| మేనికి నిన్నియుఁ జూడ మృదువై పొదువై వూని సంపదలై వుండుఁ గాన తేనై తీపై తిరువేంకటేశ నిన్ను కానవచ్చినదే [3]వొక్కటేకా నిజము | ॥ఒప్పులై॥ |
[1] ‘చన్న’ రేకు.
[2] ‘పాటి’ రేకు.
[3] ‘వొక్కటే నిజము’ రేకు.


