Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 280-1
సంపుటము: 3-459
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
తీరుచు నతఁడే దినకర్మంబది
నూరిటి రుణ మొక నూలిపోఁగునా
॥పల్లవి॥
తొల్లిటి కర్మము దోడఁ గుడుచుటకె
తెల్లమి జీవుఁడు దేహము మోచుట
వొల్లనన్నఁ బోదున్నంత గాలము
మల్లాడి హరినే మఱవఁగ వలదు
॥తీరు॥
కోరిన కోర్కికి గురియగు నందుకె
సారపు సంసారసంగమిది
నేరిచి బ్రదికేటి నెపమునఁ బోదది
కూరిమి హరినే కొలువఁగవలయు
॥తీరు॥
తెంచని యాసలఁ దిప్పుటకే పో
పంచేంద్రియముల పంతమిది
చించినఁ బోదిది శ్రీవేంకటపతి
నించి మనసులో నించగవలయు
॥తీరు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము