Display:
శృంగార సంకీర్తన
రేకు: 2001-2
సంపుటము: 29-542
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
ఉవిద చూడవే యీతఁ డొక టొకటె గడించి
కవ గూడీ నేఁ దనకు కామించిన దానను
॥పల్లవి॥
మొగము చూచితిఁగాక మొనసి జంకించితినా
నగితిఁగాక గోరు నాఁటించితినా
తగులనాడితిగాక తను నే దూరితినా
యెగసక్కేలంటా నేల యెగ్గులు వట్టీనే
॥ఉవి॥
తలవంచుకొంటిఁగాక తనతో గర్వించితినా
అలసి కూచుంటిఁగాక అలిగితినా
సొలసి మొక్కితిఁగాక సోఁకఁబెనఁగితినా
చలమరినంటానేల సాదించీనే
॥ఉవి॥
తెరవేసుకొంటిఁగాక తేరి యెలఇంచితినా
అరసి మోవిచ్చితిగా కౌఁ గాదంటినా
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె
యెరపు లేదంటా నెంత ఇమ్ముఁ గొనీనే
॥ఉవి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము