శృంగార సంకీర్తన
రేకు: 2001-3
సంపుటము: 29-543
రేకు: 2001-3
సంపుటము: 29-543
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| మొగచాటు సేయకురే ముదితలాల పతికి తగవెంచి చూచుకొని తానే వచ్చీఁగాని | ॥పల్లవి॥ |
| విడువక మూఁకొంటే విరుదా బసురువేసు తడవుగా వీడెమైతే తాలిక గట్టు వుడుగక మాఁటాడితే వూఁకొన వేసటవును తడవకురే పతిని తానే వచ్చీఁగాని | ॥మొగ॥ |
| పలుమారుఁ గొసరితే పచ్చిదేరు వలపులు తలపట్టి మొక్కఁ బోతే చండిపడును కెలసి సారె నవ్వితే కేరడములై తోఁచు తలఁపించు దూరకురే తానే వచ్చీఁగాని | ॥మొగ॥ |
| చెక్కు నొక్కి వేఁడుకొంటే చెమటలే చేయి నిండు వెక్కసానఁ బెనఁగితే వీడుఁ దురుము యిక్కడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె తక్కించకురే దినమూ తానే వచ్చీఁగానీ | ॥మొగ॥ |


