శృంగార సంకీర్తన
రేకు: 2002-1
సంపుటము: 29-547
రేకు: 2002-1
సంపుటము: 29-547
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| సతులకుఁ బతులకు సాజము లివి సతమాయ వేడుకలు సరసము లాడవే | ॥పల్లవి॥ |
| తలపోతఁ లన్నియును తగులైనందాఁకనే చలము పయ్యదకొంగు జారుదాఁకనే నలువంక కసరులు నవ్వినయందాఁకనే బలిమి యంతటి మీఁదఁ బచరించఁదగదు | ॥సతు॥ |
| మొనసిన గుంపెనలు మొక్కినయందాఁకనే చెనకులు కొనగోరఁ జిమ్ముదాఁకానే తనివోని యాసలు దగ్గరినయందాఁకానే పెనఁగులాటలు మరి బెరియించదగదు | ॥సతు॥ |
| కడలేని సిగ్గులు కాఁగిలించినందాఁకానే పొడిమెలమాఁట లియ్యకొన్నదాఁకానే యెడయక శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్ను నేలె వెడచేఁత లంతటిపై విచారించఁదగదు | ॥సతు॥ |


